కుందూలో వ్యక్తి గల్లంతు | Sakshi
Sakshi News home page

కుందూలో వ్యక్తి గల్లంతు

Published Tue, Sep 27 2016 11:33 PM

Person missing in Kundu

చాగలమర్రి/ రాజుపాళెం: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని రాజోలి ఆకనట్ట వద్ద కుందూనదిలో మంగళవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పొద్దుటూరుకు చెందిన ఈశ్వరయ్య, బాలరోసిలు రాజోలి ఆనకట్ట వద్ద చేపలు పట్టేందుకు వచ్చారు. రాజోలి ఆనకట్ట పైభాగం నుంచి ఈశ్వరయ్య ప్రమాదవశాత్తు కూందూనదిలో పడిపోయాడు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో క్షణాల్లో గల్లంతయ్యాడు. అతని మిత్రుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ మోహన్‌రెడ్డి రాజోలి ఆనకట్ట వద్దకు చేరుకొన్నారు. గజ ఈత గాళ్లతో ఈశ్వరయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement