వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు

Published Thu, Oct 8 2015 10:54 AM

వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు - Sakshi

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గురువారం వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం ఆయన బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది.

ఈ సందర్భంగా ప్రత్యేక వైద్య సిబ్బంది వచ్చి వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు నిర్వహించింది. బీపీ చెక్ చేయడంతో పాటు షుగర్ లెవల్స్, సాల్ట్ లెవెల్స్ తెలుసుకునేందుకు కోసం రక్త నమునాను సేకరించింది. మరికాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియనున్నాయ.

Advertisement

తప్పక చదవండి

Advertisement