మూసీకి కొనసాగుతున్న వరద ఉధృతి | Sakshi
Sakshi News home page

మూసీకి కొనసాగుతున్న వరద ఉధృతి

Published Sun, Sep 25 2016 9:26 AM

heavy floods to musi project

కేతెపల్లి(నల్లగొండ): హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా కేతెపల్లిలోని మూసీ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతాలనుంచి భారీ వరద వస్తుండటంతో ప్రాజెక్ట్ 5 గేట్లు 3 ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 642.8 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 16,000 క్యూసెక్కులు,ఔట్‌ఫ్లో 9,000 క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement