రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్‌ బంద్‌ | Sakshi
Sakshi News home page

రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్‌ బంద్‌

Published Tue, Mar 27 2018 9:47 AM

The statue of Rama is destroyed. Nirmal bandh

సాక్షి, నిర్మల్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహాన్ని పగలగొట్టడాన్ని నిరసిస్తూ హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు నిర్మల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నిర్మల్, ఖానాపూర్, భైంసాలో బంద్‌ కొనసాగుతోంది. బంద్‌ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.  జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement