న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్..ప్రతిపాదిత 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఆధారంగా పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రానికి సమర్పించింది. స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మాజీ ప్రమోటరు అజయ్ సింగ్‌తో కలసి కంపెనీ సీఓఓ సంజీవ్ కపూర్ శుక్రవారం పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి.సోమసుందరన్కి ప్రణాళికను అందజేశారు.
సోమసుందరన్తో భేటీ నిర్మాణాత్మకంగా సాగిందని సమావేశం అనంతరం కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఏ చమురు మార్కెటింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని, మొత్తం 18 విమానాలతో రోజుకు 230 ఫ్లయిట్ సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు 9 శాతం పెరిగి రూ. 19.25 వద్ద ముగిసింది.
అజయ్ సింగ్‌తో పాటు అమెరికా ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ సారథ్యంలోని ఫండ్ కూడా స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. కంపెనీని గట్టెక్కించే దిశగా నెల రోజుల్లోగా 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో.. ప్రస్తుత ప్రమోటరు కళానిధి మారన్ నుంచి ఇన్వెస్టర్లు కొంత వాటా కొనుగోలు చేయనున్నారు.
ఇందులో భాగంగా కంపెనీకి ఇప్పటికే రూ. 17 కోట్లు అందినట్లు.. చమురు కంపెనీలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాటితోనే తీర్చినట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 మధ్యలో దేశీ, విదేశీ విక్రేతలు, ఎయిర్పోర్ట్ ఆపరే టర్లు, చమురు కంపెనీలకు స్పైస్‌జెట్ చెల్లించాల్సిన బకాయిలు రూ. 990 కోట్ల నుంచి రూ.1,230 కోట్లకు పెరిగాయి. విదేశీ వెండార్లకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ. 624 కోట్ల నుంచి రూ. 742 కోట్లకు పెరిగాయి.
కేంద్రానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
Published Sat, Dec 27 2014 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement