సెన్సెక్స్, నిఫ్టీల సరికొత్త రికార్డు | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్, నిఫ్టీల సరికొత్త రికార్డు

Published Mon, Apr 21 2014 3:55 PM

సెన్సెక్స్, నిఫ్టీల సరికొత్త రికార్డు

హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్లలో ప్రధాన సూచీల ర్యాలీ కొనసాగుతునే ఉంది. సోమవారం ట్రేడింగ్ లో భారత ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిని నమోదు చేసుకున్నాయి. మిడ్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ ఓ దశలో 22795 పాయింట్ల, 6825 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి. ట్రేడింగ్ ముగింపులో 135 పాయింట్ల లాభంతో 22764 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 6817 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసాగోవా, లార్సెన్, ఎం అండ్ ఎం, పీఎన్ బీ, బీపీసీఎల్ లు 3 శాతానికి పైగా లాభాలతో ముగిసాయి. 
 
విప్రో అత్యధికంగా 6.77 శాతం నష్టపోగా, హెచ్ యూఎల్, కెయిర్న్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, డీఎల్ఎఫ్ కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 

Advertisement
Advertisement