రెండు వారాల గరిష్టం | Sakshi
Sakshi News home page

రెండు వారాల గరిష్టం

Published Tue, Jul 22 2014 12:40 AM

రెండు వారాల గరిష్టం - Sakshi

సెన్సెక్స్ 74 పాయింట్లు ప్లస్
25,715 వద్ద ముగింపు
 ఒక దశలో 23,861కు చేరిక

 
వరుసగా ఐదో రోజు స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 25,715 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 20 పాయింట్లు జమచేసుకుని 7,684 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్లూచిప్ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు తెలిపారు.

కాగా, సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలైంది. ఉదయం సెషన్‌లో దాదాపు 220 పాయింట్లు ఎగసి గరిష్టంగా 25,861ను తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడంతో చివరికి కొంతమేర వెనక్కి తగ్గి ముగిసింది. వెరసి 5 రోజుల్లో 700 పాయింట్లకుపైగా లాభపడింది.
 
హెచ్‌డీఎఫ్‌సీ 3% అప్
క్యూ1 ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ 3% పుంజుకోగా, ఆర్‌ఐఎల్ సైతం 2% ఎగసింది. ఈ బాటలో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌యూఎల్ 1.5-1% మధ్య బలపడ్డాయి. మరోవైపు టాటా పవర్, ఎస్‌బీఐ, గెయిల్, ఇన్ఫోసిస్, బీహెచ్‌ఈఎల్, సెసాస్టెరిలైట్, ఎల్‌అండ్‌టీ, ఓఎన్‌జీసీ 1.8-1% మధ్య నీరసించాయి.
 
చిన్న షేర్లు ఓకే
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5%పైగా పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,721 లాభపడితే, 1,244 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో సెంచురీ టెక్స్‌టైల్స్, డెల్టా కార్ప్, డిష్‌మ్యాన్ ఫార్మా, మోన్‌శాంటో, ఎంసీఎక్స్, కావేరీ సీడ్, గుజరాత్ ఫ్లోరో, జేకే ైటె ర్, డీసీఎం శ్రీరామ్, రెయిన్, ఎడిల్‌వీజ్, గతి, బీఎఫ్ యుటిలిటీస్ 9-5% మధ్య దూసుకెళ్లాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement