కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు | Sakshi
Sakshi News home page

కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు

Published Mon, Nov 18 2019 5:14 AM

Investors Complain To Govt As Karvy Delays Broking Payouts  - Sakshi

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్‌ సీడ్‌ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు పేరుకుపోవడం కార్వీ ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు ఒకరిని చూసి ఒకరు కార్వీపై ఫిర్యాదులు చేస్తున్నారు. తన ట్రేడింగ్‌ అకౌంట్‌లో ఉన్న నగదు నిల్వను బ్యాంకు ఖాతాకు మళ్లించాల్సిందిగా కోరితే, సర్వర్‌ సమస్య అంటూ దాటవేస్తున్నారని దీపక్‌ ముంద్రా అనే ఇన్వెస్టర్‌ ట్వీట్‌ చేశారు.

ఎన్నిసార్లు కోరినా సర్వర్‌ సమస్య అంటున్నారని, కారీ్వలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోరినా చెల్లింపులు జరపడం లేదని, కార్వీ చర్యలతో నమ్మకం కోల్పోయామని పుణే ఇన్వెస్టర్‌ బందియా షా ఆవేదన వ్యక్తం చేశారు. కార్వీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, సాయం చేయాలంటూ సెబీని కోరారు. 20 రోజులుగా వెంటపడుతున్నా స్పందించడం లేదంటూ ఎంకేఆర్‌ అనే ఇన్వెస్టర్‌ ఆరి్థక శాఖకు విన్నవించారు. వందకుపైగా కాల్స్‌ చేసినా ఫలితం లేదని గీతేష్‌ యోలే అనే ఇన్వెస్టర్‌ ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ‘భారత్‌లో అసలేం జరుగుతోంది. బీఎంఏ దారిలో కార్వీ’ అని ట్వీట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement