డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు? | Sakshi
Sakshi News home page

డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?

Published Sat, Feb 28 2015 2:47 PM

డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?

వ్యాపార సంబంధమైన లావాదేవీలు చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వచ్చే ప్రస్తావన డాలర్. బిజినెస్‌కు సంబంధించిన లాభాలు, నష్టాలు వేటినైనా డాలర్‌తోనే పోలుస్తారు. డాలర్‌తో రూపాయి విలువ మారకాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..! 

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు
 ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న నష్టాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భద్రత ఉన్న దేశాల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడంతో డాలర్ విలువ పెరుగుదల కనపడుతోంది.
 
 ఆర్థిక విధానం
 ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలు, ప్రభుత్వ రుణం, ప్రభుత్వ పన్నుల విధానంలో పాటిస్తున్న నియమాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వ విధానాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి.
 
 అంతర్జాతీయ వాణిజ్యం
 దేశీయంగా ఎగుమతులు తక్కువ స్థాయిలో ఉండటం, దిగుమతులు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల మనం చెల్లించాల్సిన మొత్తం ద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. భారతదేశంలో అమలవుతోన్న పన్నుల విధానం, వాణిజ్య ప్రభావమూ దీనిపై ఉంటుంది.
 
 స్పెక్యులేషన్
 దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తుంది.
 
 వడ్డీరేటు విధానం
 ప్రభుత్వ ఆర్థిక విధానాలు మార్కెట్లలో పెట్టుబడులు పెంచే విధంగా, విదేశీ మారకాన్ని స్వాగతించేలా ఉంటే విదేశీ మారకం దేశంలోకి ప్రవహించడం ద్వారా రూపాయి విలువలో పెరుగుదల  అవకాశం ఉంటుంది.
 
 ఉన్నత సంస్థల ప్రభావం

 దేశంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థ తీసుకునే విధానాలు కూడా దేశీయ కరెన్సీపై ప్రభావితం చూపిస్తాయి. మన దేశంలో ఉన్నత స్థాయి సంస్థ రిజర్వు బ్యాంకు తీసుకునే విధానాలు రూపాయి మారకం విలువలో పెరుగుదల, తరుగుదలకు దోహదపడే అవకాశాలున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement