
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ఆర్: వైఎస్ జగన్
విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
కడప : విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారం వీరపునాయనిపల్లి మండలం పాలగిరిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. 'మాట ఇస్తే నిలబడాలి..ఇచ్చిన మాటను శిలా శాసనంగా చూడాలి. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి.
ఎన్నికలకు ముందు ఒక మాట.. తర్వాత మరో మాట చంద్రబాబు నాయుడుకే చెల్లుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వైఎస్ఆర్ను చూసి నేర్చుకోవాలి. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచారు. ఆయన వెళ్తు వెళ్తూ ప్రజా కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారు' అని ఆయన అన్నారు. అంతకు ముందు వైఎస్ జగన్..వేముల మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్త జనార్థన్ రెడ్డిని పరామర్శించారు.