నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

Published Mon, Apr 27 2015 12:38 PM

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం - Sakshi

గుడివాడ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లాలో పర్యటించారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన జగన్‌... రోడ్డుమార్గం ద్వారా గుడివాడ చేరుకున్నారు. పెద్దఎరుకుపాడుకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత పాలేటి శివసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి... త్వరలో పెళ్లికాబోతున్న ఆయన కుమార్తె రత్న నిహారికను ఆశీర్వదించారు.

ఆ తర్వాత పెడన మండలం కృష్ణాపురం చేరుకుని వైఎస్ఆర్ సీపీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్‌ప్రసాద్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్‌ వెంట వైఎస్ఆర్‌సీపీ నేతలు కొడాలినాని, ఉప్పులేటి కల్పన, పేర్నినాని, ఉదయభాను, గౌతమ్‌రెడ్డి, తలశిల రఘురామ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement