
మరోసారి మాట మార్చిన వెంకయ్య
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మరోసారి మాట మార్చారు.
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మరోసారి మాట మార్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అసాధ్యమని తానెప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని వెంకయ్య బుధవారమిక్కడ తెలిపారు. విభజన చట్టంలో ఎలాంటి సవరణ ప్రతిపాదనపైనైనా రెండు రాష్ట్రాలతోనూ, సంబంధిత ప్రజాప్రతినిధులతో మాట్లాడాకే ముందుకెళతామన్నారు.
బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టంలో కొన్ని సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని వెంకయ్యనాయుడు చెప్పారు. విభజన చట్టంలో ఎలాంటి సవరణ ప్రతిపాదనపైనైనా రెండు రాష్ట్రాలతోనూ, సంబంధిత ప్రజాప్రతినిధులతో మాట్లాడాకే ముందుకెళతామన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ విభజన చట్టంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే విభజన చట్టంలో మార్పులు చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం కూడా పరిశీలనలో ఉందని వెంకయ్య తెలిపారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని అప్పట్లోనే చెప్పానని గతంలో వెంకయ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.