బొకారో ఎక్స్ ప్రెస్ అనగానే విజయనగరం పరిసర ప్రాంతాల్లో ముందుగా గుర్తుకొచ్చే పేరు దొంగల బండి.
బొకారో ఎక్స్ ప్రెస్ అనగానే విజయనగరం పరిసర ప్రాంతాల్లో ముందుగా గుర్తుకొచ్చే పేరు దొంగల బండి. అలాగే విజయనగరం స్టేషన్ దాటిన తర్వాత నుంచి దాదాపు శృంగవరపుకోట వెళ్లేవరకు ఉండే ప్రాంతాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తుంటారు. స్మగ్లింగ్ చేయడానికి ప్రధానంగా ఈ రైలునే చాలామంది ఒడిషా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల వాసులు ఉపయోగించుకుంటారు. రిజర్వేషన్ బోగీలు అని లేదు, జనరల్ బోగీలని లేదు. ఎక్కడపడితే అక్కడే ఎక్కేస్తుంటారు. వాళ్ల దగ్గరుండే సంచుల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలుంటాయి. అందుకే దీన్ని దొంగల బండి అంటారు. ఐదు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది కాబట్టి, దీనిమీద ఏ ప్రాంతం అధికారులూ ఎక్కువ పర్యవేక్షణ చేయట్లేదు.
టిక్కెట్ లేని ప్రయాణికులు కూడా చాలామంది ఈ ప్రాంతాల్లో ఉంటారు. అలాగే, ఇక్కడ తరచు.. అంటే ప్రతి రెండు మూడు రోజులకోసారి రైలు ఢీకొని మరణించే సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అందుకే దీన్ని డేంజర్ జోన్ అంటారు. అయితే ఎప్పుడూ ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది మరణించిన దాఖలాలు లేవు. ఇంత పెద్ద ప్రమాదం చూడటం ఇదే తొలిసారి అని, ఇది చాలా బాధాకరంగా ఉందని స్థానికులు అంటున్నారు.