ఎన్నికల తాయిలాలు షురూ.. | Sakshi
Sakshi News home page

ఎన్నికల తాయిలాలు షురూ..

Published Mon, Mar 4 2019 3:12 PM

TDP MLA Started  Election Gifts For Dwcra group - Sakshi

సాక్షి,తిరుపతి తుడా: తిరుపతి నగరంలో ఎన్నికల తాయిలాలు అప్పుడే మొదలయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి తాను అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో ప్రలోభాలకు తెరతీశారు. డ్వాక్రా సంఘాల రిసోర్స్‌ పర్సన్లు, ఆయా గ్రూపుల్లో కీలకంగా వ్యవహరించే లీడర్లను మచ్చికవేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. తమ మాట వినే ఒక్కో ఆర్పీకి, గ్రూప్‌ లీడర్లకు చీర, రవిక, స్వీట్‌ బాక్స్‌లను అందించారు. అలానే పార్టీ సానుభూతిపరులై ఆయా ప్రాంతాల్లో కీలకంగా ఉన్న మహిళలను గుర్తిం చారు. అలాంటి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించి గిఫ్ట్‌బాక్స్‌లను అందిస్తున్నారు. 
సీఎం సభకు రావాలని ఒత్తిడి..
రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు డ్వాక్రా మహిళలను బానిసల్లా చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నా సభలకు, సమావేశాలకు రావాలని డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవడంలేదా?, సభకు రాకుంటే  పేరును బ్లాక్‌ సిస్ట్‌లో పెడతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మెప్మా సిబ్బందితోపాటు అధికార పార్టీ నాయకులు గ్రూపులు వారీగా ఫోన్‌ నెంబర్లను సేకరించి ఫోన్‌ చేస్తూ సోమవారం నిర్వహించే సీఎం సభకు రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.

శివరాత్రి, సెలవు కావడంతో పిల్లలు ఇంట్లో ఉంటారు వచ్చేందుకు కుదరదని మహిళలు వేడుకుంటున్నా మెప్మా సిబ్బంది వేధిపులకు గురి చేస్తున్నారు. ‘మీ పేరు బ్లాక్‌ íలిస్ట్‌లో పెడతాం. చెక్‌ రాకుండా చేస్తాం’ అంటూ మహిళలకు వ్యక్తిగతంగా వేదిస్తున్నారు. గ్రూపుల వారీగా సీఎం సభకు వచ్చి ప్రాంగణంలో గ్రూప్‌ ఫొటోలు తీసుయించుకుని మెప్మా గ్రూప్‌లో పోస్టు చేయాలని హుకుం జారీ చేశారని కొంత మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement