సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Published Thu, Apr 27 2017 12:33 PM

సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి: పెనుమాక సీఆర్డీఏ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన దిగారు. కూరగాయాలు పారబోసి నిరసన తెలిపారు. సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు తాము నిరాకరించడంతో ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు రైతులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుసు మార్కెట్‌ యార్డు ఎదుట అన్నదాతలు ఆందోళనకు దిగారు. గ్రేడింగ్‌ పేరుతో కొనుగోళ్లను మార్కెఫెడ్‌ అధికారులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తు రైతులు నిరసన చేపట్టారు. కొంతమంది రైతులు భవనంపైకి ఎక్కి దూకుతామని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారికి సర్దిచెప్పేందుకు తోటి రైతులు ప్రయత్నించారు.

Advertisement
Advertisement