రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన | Sakshi
Sakshi News home page

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన

Published Thu, Mar 5 2015 9:08 AM

pawan kalyan visits andhra pradesh capital villages

గుంటూరు :  జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన  అక్కడి నుంచి రోడ్డు మార్గాన 9.30 గంటలకు ఉండవల్లి చేరుకున్నారు. పెనుమాక, ఎర్రబాలెం మీదుగా రైతులను పలకరించుకుంటూ వెళ్లి బేతపూడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం బేతపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించి అటు నుంచి తుళ్లూరు వెళతారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement