'రాజధాని నిర్మాణంలో సింగపూర్కు రాయితీలు ఇవ్వం' | Sakshi
Sakshi News home page

'రాజధాని నిర్మాణంలో సింగపూర్కు రాయితీలు ఇవ్వం'

Published Fri, Dec 19 2014 10:48 AM

'రాజధాని నిర్మాణంలో సింగపూర్కు రాయితీలు ఇవ్వం' - Sakshi

హైదరాబాద్ : రాజధాని నిర్మాణంలో సింగపూర్కు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా యనమల మాట్లాడుతూ...  రాజధాని ప్రణాళికను సింగపూర్ ఉచితంగా రూపొందిస్తోందని తెలిపారు.

పారదర్శకమైన టెండర్ల ద్వారా ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణం చేస్తామన్నారు. ఏపీకి ఎక్కువ విమానాలు రావాలని ఉద్దేశ్యంతోనే ఇంధనం పన్ను తగ్గించినట్లు యనమల వివరించారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రమే చేపడుతుందని యనమల చెప్పారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లు ఇవ్వనుందని తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement