భర్తను కడతేర్చిన భార్య | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య

Published Sun, Aug 31 2014 2:31 AM

భర్తను కడతేర్చిన భార్య

  •  ‘పేట’ మండలం బోదవాడలో ఘటన
  •   వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని దుశ్చర్య
  • బోదవాడ (జగ్గయ్యపేట) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేసింది. మండలంలోని బోదవాడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థాని కంగా కలకలం సృష్టించింది. సేకరించిన సమాచారం ప్రకారం.. బోదవాడ గ్రామానికి చెందిన దారావత్ కామేష్(22) పదమూడేళ్ల కిందట నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కృష్ణపట్నం తండాకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

    దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మి గ్రామంలో ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుందని కామేష్‌కు ఇటీవల తెలిసింది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో లక్ష్మి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వైరుతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం వేకువజామున మూడు గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో నడుచుకుంటూ జగ్గయ్యపేటకు బయలుదేరింది.
     
    బంధువులకు సమాచారమిచ్చిన గొర్రెల కాపరులు

    అదే సమయంలో గ్రామంలోని గొర్రెల పెంపకందార్లు శనివారం చిల్లకల్లులో జరిగే సంత కోసం బయలుదేరారు. లక్ష్మి పిల్లలతో వెళుతుండటాన్ని చూసి కామేష్ బంధువులకు సమాచారం అందించారు. వారు అతడి ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా కామేష్ చనిపోయి ఉన్నాడు. వారు అందించిన సమాచారంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎస్సైలు నాగరాజు, శ్రీను షణ్ముఖసాయి, ఉమామహేశ్వరరావు సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ చిన్నహుస్సేన్ కూడా వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు గ్రామంలోని సుగాలీల కులదేవత సీత భవాని ఆలయంలో పురోహితుడు. కామేష్ కుమార్తె విజయవాడ సమీపంలో ఓ ప్రాంతంలో ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది.
     
    పోలీసుల అదుపులో నిందితురాలు

    ఈ ఘటనపై కేసు నమోదవగా పోలీసులు దర్యా ప్తు చేపట్టారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై షణ్ముఖసాయి ప్రత్యేక బృందంతో నల్గొండ జిల్లాలోని కృష్ణపట్నం వెళ్లారు. ఈలోగా లక్ష్మి పిల్లలతో సహా కృష్ణానదిలో దూకిందంటూ ప్రచారం జరి గింది. ఈ ఘటన జరిగిన ఏడు గంటల్లోనే ఆమెను పుట్టినింటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మితోపాటు ఆమె తల్లిదండ్రులను  పోలీసులు పేట సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.
     
    మృతదే హాన్ని సందర్శించిన ఉదయభాను
     
    కామేష్ మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను పేట ప్రభుత్వాస్పత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఇంటూరి చిన్నా, నీలం నరసింహారావు, బూదవాడ మాజీ సర్పంచ్ పరిటాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కామేష్ మృతదేహాన్ని బోదవాడలో గ్రామ సర్పంచ్ పి.బాబూరావు, ఎంపీటీసీ సభ్యురాలు జి.సైదమ్మ, వైఎస్సార్ సీపీ నేత దారావత్  బాల్యనాయక్, బూడిద నరసింహారావు సందర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement