మహాలయ అమావాస్య అని భయపడ్డారా? | Sakshi
Sakshi News home page

మహాలయ అమావాస్య అని భయపడ్డారా?

Published Wed, Sep 24 2014 9:38 AM

మహాలయ అమావాస్య అని భయపడ్డారా?

అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ ప్రవేశించడానికి ముందు అందర్నిలోనూ అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ మంగళవారం రోజున ప్రారంభమైనదే కాకుండా.. ఈ రోజు మహాలయ అమావాస్య కావడం కూడా కొందర్నిలో అనేక సందేహాలు తలెత్తాయి. 
 
అయితే అందరి భయాలను, అంచనాలను, సందేహాలను తలక్రిందులు చేస్తూ పాడ్యమి అమావ్యాస సంధికాలంలో అంగారకుడిని మామ్ విజయవంతమవ్వడంతో ప్రత్యక్షంగా దర్శించుకున్నామని వేద పండితులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం అంగారకుడికి దుష్పలితాలు తగ్గించే విధంగా జరిగాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
అంగారకుడు దుర్గాదేవి సోదరుడని,  మంగళవారం అంగారకుడి అనుగ్రహం పొందడం వలన ప్రజలకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్నారు. అంగారకుడి 9 సంఖ్య అని, ఎక్కువ మంది తొమ్మిదో సంఖ్యకు ప్రాధాన్యమిస్తారని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నమ్మకాలకు తావుందో లేదో కాని.. భారత శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు మామ్ విజయవంత కావడం ద్వారా లభించింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement