
‘స్వర్ణాంధ్ర కోసం..’ 1.40 కోట్లు దుబారా!
ఏపీ సీఎం చంద్రబాబు.. అడుగుపెట్టిన ప్రతి చోటా చెప్పే మాట ఒక్కటే....
డబ్బుల్లేవంటూనే సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం
విజయవాడ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు.. అడుగుపెట్టిన ప్రతి చోటా చెప్పే మాట ఒక్కటే.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నాం. ప్రతిపైసాను జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అప్పుడే లోటును అధిగమిస్తాం.’ అని. అయితే ఆయన చెప్పే మాటలకీ, చేస్తున్న ఖర్చుకీ ఎక్కడా పొంతన ఉండడం లేదు. ‘స్వర్ణాంధ్ర కోసం నడుం బిగిద్దాం’ అంటూ చంద్రబాబు ముఖ చిత్రంతో లక్షా 30 వేల వాల్ హ్యాంగింగ్స్‌ను సిద్ధం చేయించారు. జిల్లాకు 10 వేల చొప్పున వీటిని అన్ని జిల్లాలకూ పంపారు.
మండల పరిషత్, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాలతో పాటు మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని తగిలించాలని ప్రభుత్వం సూచించింది. ఈ వాల్ హ్యాంగింగ్ ఒక్కొక్కటికీ రూ.100కు పైగా మొత్తం తయారీ కోసం ప్రభుత్వం రూ.1.40 కోట్ల ప్రజాధనాన్ని ప్రచారం కోసం మంచి నీళ్లలా ఖర్చు చేయడం గమనార్హం.