కలెక్టర్లు, మంత్రులపై సీఎం ఆగ్రహం
* కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలి
* లక్ష్యాలు సాధించలేదంటూ గంటాపై మండిపాటు
* యూనివర్సిటీలకు ర్యాంకులపై వీసీలకు అభినందన
సాక్షి, అమరావతి: జిల్లాల్లో అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లలో కాకుండా పనుల్లో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టాలని, జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని ఆదేశించారు.
మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు గురువారం విజయవాడలో జరిగింది. సమావేశంలో జిల్లాల వారీగా ప్రగతిని చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు ఏడేసి నిమిషాలు తమ జిల్లాపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో విడిగా సమావేశమయ్యారు. జిల్లాల్లో మంత్రులు, పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొని అభివృద్ధికి ఆటంకంగా మారితే పరిష్కారానికి చొరవ చూపాలని వారికి సూచించారు. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయే వరకూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఆధార్ ఆధారంగా ఇంటినుంచే పౌరసేవలను అందించే యాప్‌ను తయారు చే యించిన పశ్చిమ గోదావరి కలెక్టర్ భాస్కర్‌ను అభినందించారు.
మూడేళ్లవుతున్నా ఏం సాధించారు?
అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, వేలకోట్లు బడ్జెట్ ఇస్తున్నా... అనుకున్న లక్ష్యాల్లో ఒక్కటైనా సాధించారా? అంటూ మానవవనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించి మూడేళ్లయినా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలకు ప్రపంచస్థాయి ర్యాంకులు రావడంపై వీసీలను, ఉన్నత విద్యాశాఖ అధికారులను అభినందించారు.
సైనికులకు వందనం : దేశ సార్వభౌమాధికారానికి ఎవరి నుంచి ఎటునుంచైనా భంగం వాటిల్లితే సమర్థంగా ఎదుర్కొంటామని మరోసారి రుజువు చేసిన సైనికులకు వందనాలు అర్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వాగతించారు. ముఖ్యమంత్రి స్వచ్ఛభారత్‌పై నిర్వహించే సమావేశంలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం ఢి ల్లీ వెళ్లనున్నారు.
వృద్ధి రేటులో విశాఖ ప్రథమం..
రాష్ట్రంలోని జిల్లాలకు వృద్ధి రేటు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా రెండవ స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలోను నిలిచాయి. వాటి తరువాత నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలు వరస స్థానాల్లో నిలిచాయి.
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
Published Fri, Sep 30 2016 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement