ఐఐటియన్‌కు అరుదైన చికిత్స | Sakshi
Sakshi News home page

ఐఐటియన్‌కు అరుదైన చికిత్స

Published Sat, Aug 1 2015 12:33 AM

ఐఐటియన్‌కు  అరుదైన చికిత్స

ఎంవీపీకాలనీ: సాధారణంగా మూడేళ్లలోపు బదిరులైన చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చుతారు. విశాఖలో శుక్రవారం తొలిసారిగా ఆసియన్ సూపర్ స్పెషాలిటీ ఈఎన్‌టీ హాస్పటల్ వైద్యులు 23ఏళ్ల యువకుడికి ఈ పరికరం అమర్చారు. బదిరుడైనా ఐఐటీ చదివి ఉన్నతోద్యోగం చేస్తున్న ఆర్ రవిచంద్రకు కాక్లియర్ ఇంప్లాంట్ పరికరం అమర్చినట్లు ఈ సంస్థ వైద్యులు డాక్టర్ ఎస్ శ్రీకృష్ణ ప్రకాష్, డాక్టర్ ప్రదీప్ ఉండవల్లి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ పరికరాలు చెవిలో అమర్చిన తరువాత తొలుత మాట వినపడుతుందన్నారు. 20 రోజుల తర్వాత ఈ యువకుడు మాట్లాడగరని చెప్పారు.

ఐఐటీ (రూర్కీ)లో సివిల్ ఇంజినీరింగ్ చదివిన ఆర్ రవిచంద్ర (23)కు పుట్టుకతో మూగ, చెముడు. అయినప్పటికీ ఐఐటియన్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఆర్‌ఎన్‌ఐఎల్‌లో పనిచేస్తున్నారు. ఈఎన్‌టీ వైద్యులు రవిచంద్రకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. 20 రోజుల తరువాత ఇంప్లాంట్ చేసిన పరికరాన్ని ఆన్ చేశాక శబ్దాలు వినిపిస్తాయని వైద్యులు తెలిపారు. స్పీచ్ థెరపీ ద్వారా మాట్లాడగలడని వారు ధీమా వ్యక్తంచేశారు.
 
 

Advertisement
Advertisement