
రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది.
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేశారు. సుప్రీం కోర్టు దీనిని సోమవారం విచారించనుంది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజనపై స్పష్టత కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈరోజు ఒక ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.