గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగిన తర్వాత.. బతికున్న వాళ్లను కూడా శవాలనుకుని వదిలేశారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. సాధారణంగా ఎక్కడైనా ఐదారు నిమిషాల్లోనే తొక్కిసలాట కంట్రోల్ అవుతుందని, ఇక్కడ మాత్రం గంటన్నర పాటు జరిగిందని ఆయన అన్నారు. శవాలు అనుకుని కింద పడేసిన వాళ్లలో ఒక ముసలావిడకు మంచినీళ్లు పట్టిస్తే.. ఆమె బతికిందని ఉండవల్లి చెప్పారు.