మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. భారీగా అనుచరగణం వెంట రాగా శుక్రవారం నాడు పార్టీ కార్యాలయానికి చేరుకుని, సభ్యత్వం తీసుకున్నారు. జగన్ను ఇరికించేందుకు తనను పావుగా వాడుకున్నారని, కాంగ్రెస్ పార్టీ తనను ఇరికించిందని ఆయన అన్నారు.