ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ | Sakshi
Sakshi News home page

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ

Published Wed, Apr 17 2024 8:15 AM

ఆధారాలు సేకరిస్తున్న ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి - Sakshi

షాబాద్‌: గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన ముద్దెంగూడ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. అర్ధరాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తలపై టోపీలు ధరించి చేతిలో ఖట్టర్‌ పట్టుకొని మొదటగా సీసీ కెమెరా వైర్లను తొలగించారు. సీసీ పుటేజ్‌ పరిశీలించగా ఈ దొంగతనానికి ఇద్దరు వచ్చినట్లు గుర్తించారు. కింద అంతస్తుకు తాళం వేసి పైన అంతస్తులో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. దుండగులు యజమానులు నిద్రిస్తున్న తలుపునకు బయటి నుంచి గడియ పెట్టారు. లోపలికి వెళ్లి బీరువా తాళం సైతం పగుల గొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశారు. అందులో ఉన్న రెండు తులాల వెండి వస్తువులను అపహరించారు. మంగళవారం ఉదయం ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి క్లూస్‌టీం బృందం చేరుకొని ఆధారాల సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

రెండు తులాల వెండి వస్తువుల అపహరణ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement