కుతకుత..! | Sakshi
Sakshi News home page

కుతకుత..!

Published Thu, Apr 25 2024 5:03 PM

Record high temperatures in telangana for six days - Sakshi

రాష్ట్రంలో ఆరు రోజులుగా అధిక ఉష్ణోగ్రతల నమోదు 

గత పదేళ్లలో ఇదే రికార్డు అంటున్న వాతావరణశాఖ 

రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పులు 

సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: వేసవి అయినా అధిక ఉష్ణోగ్రతల నమోదులో అంతరం ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గరిష్టంగా నాలుగు లేదా ఐదురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, తిరిగి పెరుగుతాయి. కానీ ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు విశ్లేíÙస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో గత ఆరురోజులుగా సగటున 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత పదేళ్లలో ఇది రెండోసారి. గడిచిన పది సంవత్సరాల్లో 2015, 2016, 2019 సంవత్సరం ఏప్రిల్‌ నెలలో వరుసగా ఐదు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఈసారి ఆరో రోజు కూడా

అధిక ఉష్ణోగ్రత నమోదైంది.  రానున్న రెండురోజులు... 
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండ్రోజులు కూడా ఇలాగే ఉంటుందని అంచనా వేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడెం 44.9 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 44.8 డిగ్రీల సెల్సియస్‌ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(సెల్సియస్‌లలో)
కేంద్రం             గరిష్టం             కనిష్టం 
భద్రాచలం       42.8                 27.5 
ఖమ్మం             42.7                 25.6 
నల్లగొండ          42.5                 24.4 
విజయవాడ       42.0                27.0 
నిజామాబాద్‌      41.4                26.7 
రామగుండం     41.4                25.0 
హనుమకొండ    41.0                24.0 
మెదక్‌               40.6                23.0 
మహబూబ్‌నగర్‌ 40.5               27.6 
హైదరాబాద్‌       39.9               26.6 
ఆదిలాబాద్‌        38.8               22.7
విశాఖపట్నం     38.8               26.8  

Advertisement
Advertisement