4 వికెట్లతో చెలరేగిన జంపా.. 209 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ | Sakshi
Sakshi News home page

WC 2023 AUS vs SL: 4 వికెట్లతో చెలరేగిన జంపా.. 209 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌

Published Mon, Oct 16 2023 6:40 PM

WC 2023 AUS vs SL: Sri Lanka crash to 209 all out - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. కాగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(61), కుశాల్‌ పెరీరా(78) తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే నిస్సాంక ఔట్‌ అయిన తర్వాత శ్రీలంక పతనం మొదలైంది. వరుస క్రమంలో లంక వికెట్లు కోల్పోయింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 9వికెట్లను లంక కోల్పోయింది. ఆసీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆఖరిలో మ్యాక్స్‌వెల్‌ ఒక్క వికెట్‌ సాధించాడు.
చదవండి: SMT 2023: తిలక్‌ వర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బోణీ కొట్టిన హైదరాబాద్‌

Advertisement
 
Advertisement
 
Advertisement