హడలెత్తించిన రవితేజ | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన రవితేజ

Published Fri, Oct 20 2023 3:41 AM

Third consecutive win for Hyderabad - Sakshi

జైపూర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్‌ జట్టును హైదరాబాద్‌ మీడియం పేసర్‌ టి.రవితేజ హడలెత్తించాడు. రవితేజ కేవలం 13 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

సీవీ మిలింద్‌ (2/16), తనయ్‌ త్యాగరాజన్‌ (2/16) కూడా రాణించడంతో ఛత్తీస్‌గఢ్‌ 19.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. శశాంక్‌ సింగ్‌ (47 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్‌ 16 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్‌ అగర్వాల్‌ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ రాయుడు (10 బంతుల్లో 14; 2 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (13 బంతుల్లో 11; 1 ఫోర్‌), చందన్‌ సహని (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ సింగ్‌ (33 బంతుల్లో 25 నాటౌట్‌) రాణించారు. హైదరాబాద్‌ తమ తదుపరి మ్యాచ్‌లో 21న మిజోరం జట్టుతో ఆడుతుంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement