ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌  | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌ 

Published Sun, Nov 26 2023 4:16 AM

Satwik and Chirag in the final - Sakshi

షెన్‌జెన్‌: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ మరో టైటిల్‌కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్‌ భారత ద్వయం టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 21–15, 22–20తో హి జి తింగ్‌– రెన్‌ జియాంగ్‌ యు (చైనా) జోడీపై విజయం సాధించింది.

50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో  తొలి గేమ్‌ నుంచే రెండు జోడీలు చెమటోడ్చాయి. ప్రతి పాయింట్‌కు భారత జంట సమన్వయంతో శ్రమించింది. రెండో సెట్‌లో చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–20 వద్ద సమంకాగా సాత్విక్‌–చిరాగ్‌ జోడీ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement