ధోనితో ఫొటో దిగిన స్థానికులు(PC: NDTV)
MS Dhoni- Knee Pain: కొన్ని ఆరోగ్య సమస్యలకు పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా.. భారీ మొత్తం ఖర్చు చేసినా ఒక్కోసారి పెద్దగా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు హస్తవాసి బాగున్న వైద్యుల గురించి తెలిస్తే అక్కడికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవం సహజం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందుకు మినహాయింపు కాదు. మోకాలి నొప్పులతో బాధ పడుతున్న ఈ మిస్టర్ కూల్ ఇటీవల ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, ధోని ట్రీట్‌మెంట్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? దైనిక్ భాస్కర్ వార్తా పత్రిక కథనం ప్రకారం... జార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్‌లో గల వందన్ సింగ్ ఖెర్వార్ అనే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. ఆయన హస్తవాసి గురించి స్థానికంగా మంచి పేరుంది.
ఈ విషయం తెలుసుకున్న ధోని ఆయన దగ్గరకు వెళ్లి మోకాలి నొప్పుల సమస్యల గురించి బయటపడే మార్గం గురించి అడిగాడు. కాల్షియం లోపం వల్ల తాను బాధపడుతున్నానని ఖెర్వార్‌కు ధోని చెప్పాడు. దీంతో ప్రతిసారి నాలుగు రోజులకు ఓసారి తన వద్దకు రావాల్సిందిగా సదరు వైద్యుడు సూచించాడు.
ఈ విషయాల గురించి ఆయుర్వేద డాక్టర్ వందన్ సింగ్ ఖెర్వార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ‘‘మొదటి సారి ధోని నా దగ్గరకు వచ్చినపుడు ఆయనను గుర్తుపట్టలేకపోయాను. కన్సల్టేషన్ ఫీజు కింద 20 రూపాయలు.. చికిత్సకై మందుల కోసం 20 రూపాయల మేర ప్రిస్కిప్షన్ రాశాను.
ధోని తల్లిదండ్రులకు కూడా నేను వైద్యం చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి గురించి తన గురించి తెలుసుకున్న ధోని తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కాగా ధోని లాపంగ్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే, ధోని మాత్రం సెల్ఫీలు గట్రా వద్దంటూ వారిని సున్నితంగా వారిస్తున్నాడట.
ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభంలో జడేజాను కెప్టెన్‌గా నియమించిన సీఎస్‌కే.. వరుస పరాజయాల నేపథ్యంలో మళ్లీ ధోనికే సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నైకి ఘోర పరాభవం తప్పలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా 40 ఏళ్ల వయస్సులోనూ క్రికెట్ ఆడుతున్న ధోనిని గత కొన్ని రోజులుగా మోకాళ్ల నొప్పి సమస్య వేధిస్తోందట.
చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు
Comments
Please login to add a commentAdd a comment