తిలక్‌ వర్మ సెంచరీ వృథా  | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మ సెంచరీ వృథా 

Published Wed, Oct 25 2023 1:51 AM

Hyderabad lost on Baroda - Sakshi

జైపూర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జోరుకు బ్రేక్‌ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు తొలి పరాజయం ఎదురైంది. బరోడా జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (69 బంతుల్లో 121 నాటౌట్‌; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీతో అలరించాడు.

అనంతరం బరోడా జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బరోడా జట్టును కెపె్టన్‌ కృనాల్‌ పాండ్యా (36 బంతుల్లో 64 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), విష్ణు సోలంకి (37 బంతుల్లో 71 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలతో గెలిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 బంతుల్లో 138 పరుగులు జోడించడం విశేషం.   

Advertisement
 
Advertisement
 
Advertisement