ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ విధ్వంసం... ఓకే ఓవర్‌లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

T10 League: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ విధ్వంసం... ఓకే ఓవర్‌లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్‌

Published Tue, Aug 22 2023 2:02 PM

Aaron Finch Slams Five Sixes in Five Balls - Sakshi

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ అడితో ఏ మాత్రం పవర్‌ తగ్గలేదు. ఫించ్‌ ప్రస్తుతం యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.  కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఫించ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ తన జట్టు మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నైట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాలిఫోర్నియా బ్యాటర్లలో ఫించ్‌తో పాటు మిలాంద్‌ కుమార్‌(27) పరుగులతో రాణించాడు.

అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్‌ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓ‍వర్లలో ఛేదించింది. న్యూజెర్సీ బ్యాటర్లలో  టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్‌ ఓజా(25) పరుగులతో రాణించాడు.
చదవండి: MS Dhoni- Rohit: ఆరోజు రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు.. వెంటనే కోచ్‌ కూడా! మేమేం చేయలేకపోయాం..

Advertisement
Advertisement