అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి | Sakshi
Sakshi News home page

అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి

Published Mon, May 13 2024 1:38 PM

Phase 4 Elections Would Favour INDIA Bloc Says Priyanka Gandhi

లక్నో: నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని 'ప్రియాంక గాంధీ వాద్రా' సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మొదటి మూడు దశలను చూశారు. ఈ దశలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.

దేశంలోని ప్రతి ఒక్క ఓటు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితం. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ కోసం అవిశ్రాంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈరోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు మరియు ఒడిశా రాష్ట్ర శాసనసభలోని 28 స్థానాలకు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement