‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’ | Sakshi
Sakshi News home page

‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’

Published Tue, Mar 19 2024 3:18 PM

Errabelli Dayakar Rao clarity On Party Change Rumors - Sakshi

హన్మకొండ: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రణీత్‌ రావు ఎవరో కుడా తెలియదు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి. నా పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ కూడా నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు.

ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేరు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటే. నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్‌లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం.. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు’అని ఎర్రబెల్లి అన్నారు.

Advertisement
Advertisement