ఎలక్టోరల్‌ బాండ్లపై విస్తృత ధర్మాసనం | Sakshi
Sakshi News home page

ఎలక్టోరల్‌ బాండ్లపై విస్తృత ధర్మాసనం

Published Tue, Oct 17 2023 5:17 AM

Supreme Court Refers Electoral Bonds Case To Constitution Bench - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల నిధుల సమీకరణ కోసం చేసే ఎలక్టోరల్‌ బాండ్ల జారీ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనిపై దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబర్‌ 31, నవంబర్‌ 1 తేదీల్లో ధర్మాసనం తుది విచారణ జరపనుంది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుందని తొలుత ధర్మాసనం పేర్కొనడం తెలిసిందే.

‘‘కానీ విషయ తీవ్రత, ప్రాధాన్యం దృష్ట్యా సుప్రీంకోర్టు కార్యకలాపాలను నియంత్రించే ఆరి్టకల్‌145(4) ప్రకారం కనీసం ఐదుగురు జడ్జిల ధర్మాసనం దీనిపై వాదనలు ఆలకిస్తుంది’’ అని తాజాగా వివరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్‌ బాండ్ల పథకం మళ్లీ తెరపైకి రాకముందే ఈ కేసును తేల్చేయాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అక్టోబర్‌ 10న ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. బాండ్ల ద్వారా ఇలాంటి అనామక నిధుల ప్రవాహం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగి దేశం అవినీతిరహితంగా మారాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. దాంతో ఈ పిటిషన్లపై విచారణను అక్టోబర్‌ 31న మొదలు పెట్టి నవంబర్‌ 1కల్లా ముగిస్తామని ధర్మాసనం ప్రకటించింది.

2018లో తెరపైకి...
పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసమని 2018 జనవరి 2న కేంద్రం ఈ ఎలక్టోరల్‌ బాండ్ల పథకం తెచి్చంది. దీని ప్రకారం పార్టీలు నగదుకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు స్వీకరిస్తాయి. భారత పౌరులు, సంస్థలు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ రూపంలో పార్టీలకు ఇప్పటిదాకా ఏకంగా రూ.12,000 కోట్లు అందాయని పిటిషన్‌దారుల్లో ఒకరు పేర్కొన్నారు. వీటిలో మూడింట రెండొంతుల మొత్తం ఒకే పార్టీకి చేరిందన్నారు! ఎలక్టోరల్‌ బాండ్ల సేకరణపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రెండు సార్లు తోసిపుచి్చంది.

Advertisement
Advertisement