30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్‌ షోకు సన్నాహాలు! | Sakshi
Sakshi News home page

Ayodhya: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్‌ షోకు సన్నాహాలు!

Published Sat, Dec 23 2023 11:38 AM

Prime Minister Will Come to Ayodhya December 30 - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో డిసెంబర్ 30న శ్రీరామ్ విమానాశ్రయం నుంచి అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను స్థానిక అధికారులు రూపొందిస్తున్నారు. ఇదేవిధంగా ఎయిర్‌పోర్టు సమీపంలోని మైదానంలో జరగనున్న ప్రధాని మోదీ ర్యాలీకి సంబంధించిన బ్లూప్రింట్‌ను కూడా రూపొందించారు. 

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని సారధ్యంలో జరిగే ర్యాలీలో సుమారు లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కాగా స్థానిక కమిషనర్ గౌరవ్ దయాల్, ఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్ నయ్యర్‌లు సంయుక్తంగా విమానాశ్రయాన్ని, ప్రధాని ప్రతిపాదిత ర్యాలీ వేదికను పరిశీలించారు. అక్కడి వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నగర ఎస్పీ మధుబన్ సింగ్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడులకు వచ్చే భక్తులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన 165 మంది వైద్యులు సేవలందించనున్నారు. జనవరి 15 నుంచి 30 వరకు ప్రతిరోజూ నలుగురు వైద్యులు భక్తులకు అందుబాటులో ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!

Advertisement
 
Advertisement
 
Advertisement