ఈ హీరోయిన్‌కు ఫైన్ వేసిన పోలీసులు | Sakshi
Sakshi News home page

తాప్సీకి ఛ‌లానా విధించిన పోలీసులు

Published Wed, Nov 18 2020 7:30 PM

Taapsee Pannu Fined For Not Wearing Helmet - Sakshi

'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు తాప్సీ ప‌న్ను. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ త‌క్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత‌ టాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతో స‌డ‌న్‌గా బాలీవుడ్‌కు మ‌కాం మార్చారు. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో పాటు స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టిస్తూ బిజీబిజీగా మారారు. ప్ర‌స్తుతం ఆమె "రష్మి రాకెట్‌" చిత్రంలో అథ్లెట్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం డైట్ మార్చేసి, వ్యాయామం మీద ఫోక‌స్ పెడుతూ ప్రత్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె బుధవారం నాడు ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో తాప్సీ.. సినిమా షూటింగ్‌లో భాగంగా హెల్మెట్ పెట్టుకోకుండా బుల్లెట్ న‌డుపుతున్నారు. కానీ ఇది పోలీసుల కంట ప‌డ‌టంతో ఫొటో కొట్టి ఆమెకు ఫైన్ విధించారు. (చ‌ద‌వండి: చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే: కథానాయికలు)

ఈ విష‌యాన్ని ఆమె అభిమానుల‌తో పంచుకున్నారు. "ఛ‌లానా విధిండానికి ముందు.." అంటూ త‌ను షేర్ చేసిన ఫొటోకు క్యాప్ష‌న్ సైతం జోడించారు. అయితే ఇది వెన‌క నుంచి తీసిన ఫొటో కావ‌డంతో అక్క‌డు ఉన్న‌ది తాప్సీనే అని గుర్తుప‌ట్ట‌డం కాస్త‌ క‌ష్టంగా ఉంది. ఇక తాప్సీ సినిమాల విష‌యానికొస్తే ఇటీవ‌లే ఆమె విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఓ త‌మిళ సినిమాలో న‌టించారు. ప్ర‌స్తుతం త‌న పూర్తి స‌మ‌యాన్ని ‘రష్మి రాకెట్‌’  చిత్రం కోసం కేటాయిస్తున్నారు. (చ‌ద‌వండి: ఎన్నో అవమానకర పరిస్థితులు చూశా: తాప్సీ)

Advertisement
 
Advertisement
 
Advertisement