మాయా సెల్‌ఫోన్‌ | Sakshi
Sakshi News home page

మాయా సెల్‌ఫోన్‌

Published Thu, Jun 29 2023 4:05 AM

Mayapetika Pre-Release Press Meet - Sakshi

‘‘మాయా పేటిక’ సినిమాలో నా మనసుకు దగ్గరైన పాత్ర నాది.. అందుకే ఎంతో ఇష్టపడి చేశాను. సెల్‌ఫోన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అని హీరో విరాజ్‌ అశ్విన్  అన్నారు. రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో విరాజ్‌ అశ్విన్, పాయల్‌ రాజ్‌పుత్, సిమ్రత్‌ కౌర్, రజత్‌ రాఘవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రమేష్‌ రాపర్తి మాట్లాడుతూ– ‘‘మాయా పేటిక’ ద్వారా సెల్‌ఫోన్‌ కథ చెబుతున్నాం. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘రెగ్యులర్‌ కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి. ‘‘నా కెరీర్‌లో ‘మాయా పేటిక’ ముఖ్యమైనది’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ‘‘అద్భుతమైన డ్రామా, వినోదం, సంగీతం ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సిమ్రత్‌ కౌర్‌. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్యామల, రజత్‌ రాఘవ్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement