Sakshi News home page

ఎన్‌హెచ్‌–363 నిర్మాణంలో అదే జాప్యం.. మరోవైపు టోల్‌ వసూలు..

Published Fri, Aug 25 2023 1:30 AM

- - Sakshi

మంచిర్యాల: జాతీయ రహదారి–363 పనులు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా కొనసాగుతూ నే ఉన్నాయి. ఓ వైపు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నందుకు టోల్‌ వసూలు.. మరోవైపు పూర్తి కాని చోట పనులు సాగుతున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు నిర్మాణం కరోనా, తర్వాత కూడా గడువు పొడగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు వరకే పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. మరోసారి జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు.

ఏళ్లుగా నిర్మాణంలోనే..
రాజీవ్‌ రాష్ట్రీయ రహదారిని శ్రీరాంపూర్‌ జీఎం ఆఫీ సు నుంచి మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు జాతీయ రహదారిగా మార్చుతూ 2016లో కేంద్రం గెజిట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో పని ఉత్తర్వులు, 2018లో భూ సేకరణ, 2019లో బిడ్డింగ్‌ పూర్తయ్యాయి. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో రెండేళ్ల నిర్మాణం, 15ఏళ్ల నిర్వహణ చేపట్టాలి. రెండు భాగాలుగా మొత్తం 94.602కిలోమీటర్లు నిర్మించాలి.

కాంట్రాక్టర్‌ రూ.1356.90 కోట్లకు బిడ్‌ వేయగా.. అదనపు పనులతో నిర్మాణ వ్యయం రూ.1948కోట్లకు చేరింది. జిల్లాలో శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం నుంచి తాండూర్‌ మండలం గోయగాం వరకు 42కిలోమీటర్లు నిర్మించాలి. గత ఏడాదిగా పది శాతం పనుల నిర్మాణమే చేస్తున్నారు. వాస్తవానికి ఈ పనులు 24 నెలల్లో అంటే 2022 ఆగస్టులోపే చేయాలి. నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే రోజుకు రూ.5లక్షల చొప్పున కాంట్రాక్టర్‌ పరిహారం వేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్‌ గడువు పెంచాలని కనీసం కోరకున్నా అధికారులే జనవరి వరకు పెంచేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం.

రక్షణ చర్యలు కరువు..
నిర్మించిన రోడ్డుకు టోల్‌ప్లాజా నుంచి రోజు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ప్రయాణికులకు అవగాహ న, భద్రత చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ప్ర మాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంపూర్‌ బైపాస్‌ రోడ్డు, బెల్లంపల్లి బైపాస్‌ రో డ్డుపై రాత్రివేళ వెలుతురు సరిగా లేక భారీ వాహనా లు అదుపు తప్పుతున్నాయి. బోయపల్లి బోర్డు, క న్నాల, సోమగూడెం చర్చి సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

కొత్తగా రోడ్డు వేయడంతో అతివేగంతోనూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్‌హెచ్‌ఏఐ అధి కారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అవేమీ చేపట్టడం లేదు. సిగ్నల్స్‌, మలుపులు, భద్ర త సూచికలు, రాత్రివేళ రేడియం స్టిక్కర్లు మెరిసేవి, అంబులెన్స్‌, ప్రథమ చికిత్స కిట్లు, టోల్‌ప్లాజా వద్ద జనరల్‌, మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి.

ఇవేమీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారులు స్థానిక డ్రైవ ర్లు, వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వా లి. ఇక వర్షాలు కురిస్తే సోమగూడెం, గాంధారి వనం సమీపంలో డ్రెయిన్స్‌ సరిగా లేక సమీపంలో వరద నీరు చేరుతోంది. వాహనదారుల భద్రత కోసం ప్ర త్యేక కన్సల్టెన్సీ పర్యవేక్షణకు నిధులు మంజూరవుతున్నా ఖర్చుకు అలసత్వం వహిస్తున్నారు.

జాప్యంతో ఇబ్బందులు..
మందమర్రి పాత బస్టాండ్‌ వద్ద వంతెన నిర్మాణం జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్‌ జామ్‌తోపాటు ప్రమాదాలు జరగుతున్నాయి. కొత్తగా పిల్లర్లు వేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ, జా ప్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. త్వరగా పూర్తి చేయాలి. – కొట్టె కొమురయ్య, మందమర్రి

వచ్చే జనవరిలో పూర్తి చేస్తాం..
మందమర్రి వద్ద రోడ్డు నిర్మాణం ఉన్న చోట ఉన్న పైపులు మార్చడంలో జాప్యం ఏర్పడింది. దీంతో అక్కడ నిర్మాణంలో జాప్యం జరిగింది. వచ్చే జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు గడువు ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులతో అవగాహన చేపడతాం. – కే.ఎన్‌.అజయ్‌మణికుమార్‌, పీడీ, ఎన్‌హెచ్‌ఏఐ, మంచిర్యాల

Advertisement
Advertisement