హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

Published Thu, Apr 18 2024 9:40 AM

మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: హామీల అమలు లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 130 రోజులైనా రూ. 2లక్షల రైతు రుణాన్ని ఎందు కు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో పంటలు చేతికి అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందుకు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని అన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్‌ కోతలు ఆరంభమయ్యాయని, సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సమన్వయకర్త ఆషాప్రియా ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement