నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అ త్యధిక సంఖ్యలో రైతులు, గల్ఫ్ కార్మికులు ఉంటారని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొ న్నారు. రైతులను బీఆర్‌ఎస్, బీజేపీలు పట్టించుకోలేదన్నారు. పసుపుబోర్డుపై అర్వింద్ ఉత్తర్వులతో సరిపెట్టారని వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్‌లో ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. పసుపుబోర్డు నిజామాబాద్‌లో ఏర్పా టు చేస్తారా లేక అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేస్తా రా స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్, బీజేపీపై ఉందన్నారు. గతంలో పసుపు క్వింటాలు అమ్మితే రైతు తులం బంగారం కోనుగోలు చేసేవారని, ఇప్పడు క్వింటాలు పసుపు ధర రూ. 15వేలు ఉందన్నారు. నిజామాబాద్‌కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment