సమావేశంలో ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేశ్‌బాబు
లింగంపేట(ఎల్లారెడ్డి) : విద్యుత్ శాఖ పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేశ్‌బాబు సూచించారు. శుక్రవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల డివిజన్ స్థాయి ట్రాన్స్‌కో ఉద్యోగుల సమావేశంలో పాల్గొని అవగాహన కల్పించారు. ఎన్పీడీసీఎల్ డీఎండీ ఆదేశాల మేరకు శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఉద్యోగులు చూ డాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు తరు చూ కాలిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలని వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈలు వెంకట్‌రంగ య్య, గణేష్, ఏడీలు సుదర్శన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ఆ రుగురు ఏఈలు, లైన్‌ఇస్పేక్టర్లు, లైన్‌మెన్‌లు, జూనియర్ లైన్‌మెన్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment