Viral Video: Man Using His Pet Python As Weapon To Attack In Canada - Sakshi
Sakshi News home page

Viral Video: కొండచిలువనే ఆయుధంగా..వ్యక్తిపై దాడి

Published Mon, May 15 2023 6:45 PM

Viral Video: Man Using His Pet Python As Weapon To Attack In Canada - Sakshi

కొందరూ తమ పెంపుడు జంతువులను, పక్షులను ప్రేమగా చూసుకుంటున్నట్లు కలరింగ్‌ ఇస్తారు. నిజానికి కొందరూ వారికేదో సరదా హాబీలా పెంచుతారు. తమకు ఇబ్బంది లేదా కష్టం అనుకుంటే వాటి ప్రాణాలు తీసేందుకు లేదా వాటిని ప్రమాదంలో పడేయడం వంటివి చేస్తారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి ఓ పెంపుడు కొండచిలువ పట్ల అలానే వ్యవహరించాడు. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..కెనడాలోని టొరంటోలో ఓ వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఆయుధంగా ఉపయోగించుకుని దాడికి దిగుతాడు. పాపం ఆ వ్యక్తిని నడి రోడ్డుపై ఆ పెంపుడు పాముని తాడు మాదిరిగా చేసుకుని ఇష్టారీతిలో కొడుతుంటాడు. అవతల వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు యత్నించినా కూడా వదలకుండా అలా దాడి చేస్తూనే ఉ‍న్నాడు.

సరిగ్గా అదే సమయంలో పోలీసు వాహానం అటుగా రావడంతో వెంటనే సదరు వ్యక్తిని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని టోరంటో నివాసి 45 ఏళ్ల లారేనియో అవిలాగా గుర్తించి అరెస్టు చేయడమే గాక ఒక ప్రాణిని ఇబ్బందులకు గురి చేసినందుకు పలు కేసులు నమోదు చేసి కోర్టులో హాజర్చారు కూడా. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!: ఇమ్రాన్‌ ఖాన్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement