Linda Andrade Dubai Lists Out Worst Things With Millionaire Husband - Sakshi
Sakshi News home page

ఈ అమ్మడు సమస్య భలే విచిత్రం..! భర్తకు బాగా డబ్బు ఉండటమే ఆమెకు తలనొప్పి అట!

Published Mon, May 29 2023 8:12 PM

Linda Andrade Dubai Lists Out Worst Things With Millionaire Husband - Sakshi

శ్రీమంతుడైన భర్తను పొందాలని అమ్మాయిలు అనుకుంటారు. ఎందుకంటే..'ధనం మూలం ఇదం జగత్‌'. అంటారు కదా! ప్రపంచమంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో బతకొచ్చు. ఖరీదైన నగలు వేసుకొవచ్చు. విలువైన బట్టలు.. ఇలా ఇతరులు కొనలేని ఎన్నో వస్తువులను ధనవంతుడైన భర్త ఉంటే తెచ్చిపెడతాడు. కానీ ఇదే తనకు సమస్య అవుతుందని అంటోంది ఓ భార్య. శ్రీమంతుడైన భర్తలుంటే ఇదే సమస్య అంటూ.. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఇంతకీ ఆవిడ సమస్య ఏంటో మరి..!

ఆవిడ పేరు లిండా ఆండ్రాడే. దుబాయ్‍లో ధనవంతుడైన భర్తతో ఉంటోంది. శ్రీమంతడైన భర్త కాబట్టి విలువైనవి కొనిస్తున్నాడట. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం ఇబ్బందవుతోందట. అవన్నీ దాచుకోవడం కష్టమవుతోందట ఈ అమ్మడుకు. వాటిని ఎప్పుడు, ఎవరు దోచుకెళ్తారో అని భయం పట్టుకుంటోందని వీడియోలో పేర్కొంది. ధనవంతడైన భర్తలున్నా ఎన్నో కష్టాలున్నాయని చెబుతూ ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

నెట్టింట ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వ్యూయర్స్ విభిన్న  స్పందనలతో కామెంట్స్‌ బాక్స్ నిండిపోయింది. పోస్టు చేసిన  'నీకు అన్ని కష్టాలున్నాయా?. మనం మన జీవితాలను రీప్లేస్ చేసుకుందామా?' అంటూ ఓ వ్యూయర్ కామెంట్ పెట్టాడు.

ఈవిడ నిజంగానే సమస్యలతో ఉందా..? ఇది జోకా?, 'మా తల్లే.. నిజంగా ఖరీదైన వస్తువులను ఎప్పుడైనా వాడావా?. ఇదే మొదటిసారా?', ధనవంతులైన భర్తలు తొందరగా బోర్ కొట్టేస్తారేమో అంటూ మరికొందరు స్పందించారు. ఆ మహిళకు కొందరు వ్యూయర్స్ సపోర్టు కూడా చేశారు. ఆమె వ్యక్తిగత జీవితంపై మనం కామెంట్ చేయకూడదు అని కామెంట్ పెట్టారు. రూ.4.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌.. ఎంత తాగాడో తెలుసా?

Advertisement
 
Advertisement
 
Advertisement