Joe Biden Snaps at 'Idiot' Protesters who brand him a Socialist
Sakshi News home page

బ్రేక్‌ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్‌ అనేది తేలుద్దాం: బైడెన్‌ ఫైర్‌

Published Mon, Nov 7 2022 11:20 AM

Joe Biden Snaps His Policies Socialism As Idiots Attack On Republican - Sakshi

తన విధానాలను సోషలిజంగా పేర్కొంటూ ఇడియట్స్‌గా ముద్రవేస్తున్నారంటూ మండిపడ్డారు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌. ఈ మేరకు ఆయన ఇల్లినాయిస్‌లోని జోలియెట్‌లో ఒక  ప్రాథమిక పాఠశాలలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న సామజిక సేవలను విమర్శిస్తూ సోషలిజంగా పేర్కొంటున్నారని అన్నారు.

రిపబ్లికన్లు ప్రజలకు సామాజిక భద్రత కల్పించే సేవ కార్యక్రమాలను హరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన సోషలిజాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా వచ్చినప్పుడే  సోషలిజం సంకేతాలు వినిపించాయి అందుకే దాన్ని  ప్రేమించాను అందులోకి వచ్చానని దృఢంగా చెప్పారు.

ఐనా రిపబ్లికన్లు సామాజిక భద్రత, వైద్య సంరక్షణ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాశనం చేయాలని చూశారంటూ బైడెన్‌ మాటాల తుటాలు పేల్చారు. కష్టపడి పనిచేయండి, సహకరిచండి అప్పుడు మీకు ఈ విషయాలు సులభంగా అర్థమవుతాయంటూ గట్టి కౌంటరిచ్చారు. ఇవి నిబద్ధతతో కూడిన హామిలు, దీన్ని అమెరికన్‌ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే బాగా పనిచేస్తుంన్నారు. రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ...దయచేసి కాస్త బ్రేక్‌ ఇవ్వండి  కచ్చితంగా ఎవరు ఇడియట్స్‌ అనేది తేలిపోదుంగి అని వ్యగ్యంగా అన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలతో  సభా ప్రాంగణం ఒక్కసారిగా నవ్వులు, చప్పట్లతో మారు మ్రోగిపోయింది. 

(చదవండి: జెలెన్‌స్కీ తరుపై అసహనం...అత్యాశకు పోతే అంతే!)

Advertisement
 
Advertisement
 
Advertisement