ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్‌ చేస్తే అంతలోనే.. | Sakshi
Sakshi News home page

ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్‌ చేస్తే అంతలోనే..

Published Wed, Dec 13 2023 5:13 PM

Woman Mistook Heart Attack She Thought Was The Flu - Sakshi

కొన్ని జబ్బుల తీరు వైద్యులు చెప్పిన లక్షణాలేవి కనిపించకుండానే సైలంట్‌గా దాడి చేస్తాయి. అందువల్లే ప్రజలు కూడా తేలిగ్గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతలా అలాంటి వాటిని కట్టడి చేసి ప్రజల్లో ఆ వ్యాధులపై అవగాహన కల్పిద్దామన్నా పరిస్థితుల దృష్ట్యా లేదా జీవనశైలి కారణంగానో ఆ వ్యాధుల లక్షణాలు కూడా ఆశ్చర్య కలిగించే రీతిలో వస్తున్నాయి. అలాంటి షాకింగ్‌ లక్షణాలే ఇక్కడొక మహిళలో కనిపించడంతో లైట్‌ తీసుకుంది. అదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చి ఆస్పత్రి పాలు చేసింది.  

అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్‌ ఘటన యూఎస్‌ఏలో చోటు చేసుకుంది. జెన్నా టాన్నర్‌ అనే 48 ఏళ్ల మహిళ గతేడాది మహమ్మారి సమయంలో కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే ఆమె ఇంటిల్లపాది ఆ మహమ్మారి బారిన పడి బయటపడ్డారు. అయితే ఆమెకు ఒక రోజు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది సేమ్‌ కరోనా మాదిరి సమస్యే అనుకుంది ఆమె. బహుశా ఫ్లూ లాంటి జ్వరం కాబోలు అనుకుని లైట్‌ తీసుకుంది. భర్తకు కూడా చెప్పకూడదనుకుంది. ఎందుకంటే? ఆస్పత్రిలో చేరిపోమంటారన్న భయం తోపాటుపైగా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో టాన్నర్‌  చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.

అది కాస్త తీవ్రమై సడెన్‌గా ఓ రోజు ఇంట్లోనే స్ప్రుహతప్పి పడిపోయింది. కట్‌ చేస్తే.. ఆమె రెండు రోజుల వరకు ఆస్పత్రిలోనే కోమాలో ఉంది. రెండో రోజు సాయంత్రం మెలుకువ వచ్చి అంతా తెలుస్తున్నా.. ఏది తన కండిషన్‌లో లేనట్లు, గుండెపై ఏనుగులాంటి పెద్ద బరువు ఏదో ఉన్నట్లు తోచింది ఆమెకు. కనీసం బెడ్‌ మీద నుంచి కదలాలనుకున్న కొంచెం కుడా కదలలేకపోతోంది. కనీసం చేతిని కూడా కదపడం కష్టంగా ఉంది. ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కాలేదు.  ఆ తర్వాత కాసేపటికి తనవాళ్లు వచ్చి తనకు గుండె పోటు వచ్చిందని చెప్పేంత వరకు కూడా ఆమెకు ఏం తెలియదు. అయితే తనకు వచ్చింది గుండెపోటా..? అని నిర్ఘాంతపోయింది. నాకలాంటి సంకేతాలేం కనిపించలేదు కదా! అని ఆలోచిస్తూ షాక్‌లోనే ఉండిపోయింది.

ఆ తర్వాత వైద్యులు ఆమెకు బైపాస్‌ సర్జరీ చేసి స్టంట్‌ వేశారు. అస్సలు గుండెపోటు వచ్చినప్పుడు ఇలా గాలి పీల్చుకోవడం వంటి రెస్పిరేషన్‌ సమస్యలు కూడా వస్తాయ? అని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆమె తనలా ఎవరూ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో తన ఉదంతాన్ని అందరికీ చెప్పి గుండెపోలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించే యత్నం చేస్తోంది టాన్నర్‌.

కాగా,అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మహిళలకు గుండెపోటులో యూఎస్‌ తొలి స్థానంలో ఉంది. నిజానికి గుండెపోటు అనంగానే ఛాతీ నొప్పిలా వస్తుందని అందరికీ తెలుసు. కానీ మహిళ్లల్లో ఇలా కాకుండా వేర్వేరు లక్షణాలతో కూడా సంకేతాలిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. స్త్రీలల్లో ముఖ్యంగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వెన్ను, భుజం, దవడ నొప్పి వంటి ఇతర లక్షణాల రూపంలో కూడా సంకేతమిస్తుందని అన్నారు. ఏదీ ఏమైనా 45 ఏళ్లు దాటాక ఏ వ్యక్తి అయినా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్యులు. 

(చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్‌ చూసి కంగుతిన్న వైద్యులు)

Advertisement
Advertisement