నూడుల్స్‌లో డైమండ్స్‌ : ఏం తెలివితేటలు రా అయ్యా! | Sakshi
Sakshi News home page

నూడుల్స్‌లో డైమండ్స్‌ : ఏం తెలివితేటలు రా అయ్యా!

Published Tue, Apr 23 2024 4:44 PM

Diamonds Worth Crores Found In Noodles At Mumbai Airport Passenger cought - Sakshi

బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు  కేటుగాళ్లు అనుసరిస్తున్న  పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి  పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.  ముఖ్యంగా నూడుల్స్‌ ప్యాకెట్లలో డైమండ్స్‌ దాచిన తీరు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 

ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్లను  తరలిస్తూ  గుట్టుగా  అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ  తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి.

మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి  ఇద్దరు,  బహ్రెయిన్ ఇద్దరు,  దోహానుఎంచి ఇద్దరు రియాద్  ఇద్దరు  మస్కట్  బ్యాంకాక్ ,సింగపూర్  నుంచి ఒక్కొక్కరు  చొప్పున 10 మంది అనుమానితులను  తనిఖీ చేయగా, రెక్టమ్‌, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.  మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా  బంగారం, డైమండ్స్‌,తదితరాలను  కస్టమ్స్  అధి​కారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement