లవ్‌ ఫెయిల్యూర్‌.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు..  | Sakshi
Sakshi News home page

లవ్‌ ఫెయిల్యూర్‌.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు.. 

Published Mon, Jun 6 2022 10:25 AM

Young Woman Commits Suicide After Failing To Love In Visakhapatnam - Sakshi

తగరపువలస (భీమిలి) విశాఖపట్నం: ప్రేమ విఫలమై భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని కొయ్య లావణ్య(16) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొయ్య లావణ్య, ఇదే గ్రామానికి చెందిన మణి కుమార్‌ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
చదవండి: స్కూల్‌ కరస్పాండెంట్‌ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి..

ఈ క్రమంలో వివాహం చేసుకోమని మణికుమార్‌ను లావణ్య కోరగా నిరాకరించాడని ఒక కథనం వినిపిస్తుండగా.., మణికుమార్‌ కుటుంబ సభ్యులు లావణ్య కుటుంబ సభ్యులను కలిసి వివాహం గురించి మాట్లాడగా వారు నిరాకరించారని మరో కథనం వినిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న లావణ్యను సంగివలస అనిల్‌ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు నిర్ధారించారు. మధ్యాహ్నం గ్రామంలో జరిగిన రజస్వల ఫంక్షన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న లావణ్య ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభిన్న కథనాలపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

 

Advertisement
 
Advertisement
 
Advertisement