రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్‌

Published Sat, Jan 6 2024 3:35 PM

Atmakur Police Who Caught The Kidnappers - Sakshi

సాక్షి, నంద్యాల/హైదరాబాద్‌: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్‌ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి సురేందర్‌ని రాయదుర్గం పిలిపించిన సోదరి.. కిడ్నాపర్లకు అప్పగించింది.

సురేందర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న కిడ్నాపర్లు.. నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్‌కి పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్‌ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు.

సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను కిడ్నాప్‌ చేసి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో కారును కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఫారెస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా,  కారు,బాధితుని వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఒక కిడ్నాపర్‌ను ఫారెస్ట్‌ సిబ్బంది పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు పారెస్ట్‌ అధికారులు సమాచారం ఇవ్వడంతో సురేందర్‌ను క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కిడ్నాప్ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్‌ స్పాట్‌కు సురేంద్‌ను తరలించిన పోలీసులు.. సోదరి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్‌ నుంచి ఆరు గంటల పాటు వివరాలు సేకరించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. భారీగా డబ్బులు వసూలు చేయడానికే కిడ్నాప్‌ స్కెచ్‌ వేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..

Advertisement

తప్పక చదవండి

Advertisement